Posts

Showing posts from April, 2023

రాజ్యాంగ హక్కులు _మహిళలు

రాజ్యాంగ హక్కులు _మహిళలు           అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఇచ్చింది.        పురుషాధిక్య సమాజం మాత్రం దీనిని ఇంకా జీర్ణించుకోలేకుండావుంది. సమాజంలో రాజకీయంగా, కుటుంబపరంగా తీసుకొనే నిర్ణయాలలో మహిళలకు ఎటువంటి భాగస్వామ్యం లేదు. కుటుంబ బాధ్యతలు ఎంత మోస్తున్నా వారి అభిప్రాయాలకు కొంచెం కూడా విలువ ఇవ్వడం లేదు.సమాన హక్కుల ని ఎంత గొంతు చించుకున్నా మహిళలకు ఇంటా బయట ఎటువంటి అధికారాలు లేకుండా చేస్తున్నారు.              పౌష్టికాహారం లేమి కారణంగా రక్తహీనతతో మహిళా వర్గం బాధపడుతోంది. ఇంటి పని తో, బయట పనితో సతమతమవుతోంది శ్రామిక మహిళ.  మహిళలే వంట చేసినా ఆహారాన్ని మగవాడే ఎక్కువభాగం తీసుకోవడం వల్ల ఆమె తక్కువ తీసుకుంటోంది.దాంతో పోషకాహారం తగ్గి అనేక రోగాలకు గురవుతోంది. ప్రసూతి మరణాలకు,శిశు మరణాలకు ఇది ప్రధాన కారణంగా ఉంది. 2005 ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం మగ శిశువుల మరణాలు కన్నా ఆడ శిశు మరణాల సంఖ్య 61 శాతం అధికంగా ఉంది.14 ఏళ్ల లోపు పిల్లలందరికీ విద్య గ్యారెంటీ చేయబడి...