Posts

Showing posts from March, 2022

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

         1908లోనే మహిళా ఉద్యమం  బాటలు పడ్డాయి. న్యూయార్క్ లోని వస్త్ర తయారీ రంగంలోని మహిళా కార్మికులు సమ్మెకు దిగారు. వీధుల్లో ప్రదర్శనలు చేశారు. తమ పనిలో అమానవీయ దోపిడికి వ్యతిరేకంగానూ, సమాన వేతనం  డిమాండ్ చేస్తూనూ ధిక్కార స్వరం వినిపించారు. పురుషులతో సమానంగా తమకూ ఓటు హక్కు కావాలని నిలదీశారు. ఏడాది తర్వాత 1909 లో అమెరికన్ సోషలిస్టు పార్టీ పిలుపుమేరకు చరిత్రలో మొట్ట మొదటి సారి 'నేషనల్ ఉమెన్స్ డే' ని అమెరికా వ్యాప్తంగా ఫిబ్రవరి 28న  జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా, కోవిడ్ కారణంగా, మహిళలు ఉపాధి కోల్పోయి 800 బిలియన్ డాలర్లు  నష్టపోయారు. 2021సంవత్సరంలో 47 మిలియన్ల మహిళలు పేదరికంలో కూరుకు పోయారు. మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మహిళలు అత్యధికులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు కనక వారి ఆదాయాలు కుంచించుకు పోయాయి. మహమ్మారి కాలంలో వేతనం లేని పని పెరిగింది. కుటుంబంలో పని భారం పెరిగింది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గి గ్రామీణ మహిళలు నష్టపోతున్నారు. ఏ స్థాయి ఆర్థిక సంక్షోభానికి భారతీయ మహిళలు గురయ్యారన్నది లెక్కకు అందని విషాదం. అంతేకాద...