ప్రభుత్వరంగం -మహిళలు
ప్రభుత్వరంగం -మహిళలు ప్రభుత్వరంగ సంస్థలు ఆధునిక దేవాలయాలు, అన్ని వేళలా ఆదుకునే అక్షయ పాత్రలు. దేశ సమాజక, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి పటిష్టం చేసే విద్య వైద్యం, ఆరోగ్యం, గనులు. బ్యాంకింగ్, బీమా, సహజ వనరులు, రక్షణ, ఉత్పాదక రంగాలు ప్రభుత్వ అజమాయిషీలో కొనసా గడమే శ్రేయస్కరమని దేశ ప్రజలకోసం. రాజ్యాంగబద్ధంగా ఆయా ప్రభుత్వరంగ సంస్థలు ఆవిర్భవించాయి.ప్రైవేటు సంస్థ లు జాతీయకరణ చేయబడ్డాయి. 1950, 60, 70. 80 దశకాలలో ఈ ప్రక్రియ అనేక కుటుంబా లలో వెలుగులు నింపి వారి విద్య, వైద్య ఉపాధి అవకాశాలను మెరుగుపరిచాయి. "అబ్బాయి చదువు. అమ్మాయి పెళ్ళి" అనే నినాదం అనేక పొదుపు సంక్షేమ పథకాలలో ప్రాచుర్యంలో వుండేది. అమ్మాయిల చదువులకు తక్కువ ప్రాధాన్యం వుండేది. ప్రభుత్వరంగ సంస్థల వలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. క్రమేపి ఉద్యో గులు తమ ఆడపిల్లలను చదివించి వారు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించడం ప్రారంభించారు. నాడు ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ భరోసా, భద్రత, సదుపాయాలు ప్రయోజనకరమైన కార్మిక చట్టాలను అమలు చేయడం మహిళల విద్యను, ఉపాధిని ప్రోత్సహించాయి. కార్మిక చట్టాల పటిష్ట అమలు నంఘటితరంగంలోనే సాధ్యమవుతాయి. ప్రభుత్వ...