Posts

Showing posts from March, 2023

మహిళా విముక్తి - ఎంగెల్స్‌

మహిళా విముక్తి - ఎంగెల్స్‌  —————————————— మహిళా విముక్తి కోసం ఎంగెల్స్‌ తన రచనల ద్వారా అందించిన చారిత్రాత్మక అవగాహన కాలం గడిచినా పదును తగ్గలేదు. ఎంగెల్స్‌ మార్క్స్‌ ఉమ్మడిగా శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతం, దాని ఆచరణ గురించిన సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలపై వ్యవస్థీకృత వివక్ష, వారిపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా చేసే పోరాటాలకు వెలుగును అందిస్తుంది. అభిóవృద్ధి చెందిన ఆధునిక పెట్టుబడిదారీ సమాజంలో కూడా మహిళలపై వివక్ష, హింస కొత్త రూపాలలో కొనసాగుతున్నాయి. మహిళలు రెండో శ్రేణి మనుషులనీ, దానికి వారి శరీర నిర్మాణం, వారి మానిసిక స్థితే కారణం అనే పాలకవర్గాల తప్పుడు వాదనలను, కట్టు కథలను ఎంగెల్స్‌ బట్టబయలు చేశారు. మత గ్రంథాలు కూడా మహిళలను రెండో శ్రేణి మనుషులుగానే చిత్రిస్తున్నాయని, వర్గ సమాజంలోని పాలకవర్గాలు శత్యాబ్దాల నుంచి ప్రచారం చేస్తున్నాయి. వాటి గుట్టును ఎంగెల్స్‌ బహిరంగపరిచారు. పెట్టుబడిదారీ వ్యవస్థ తొలిరోజుల్లో మహిళలు, బాల కార్మికులపై జరిగే ఆటవికమైన క్రూర వర్గదోపిడీని ఎంగెల్స్‌ ఎత్తిచూపుతూ, ఈ దోపిడీ విధానాన్ని పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలోని బాల్య దశ అ...

సమాజం పరిణామం_ స్త్రీలు

సమాజం పరిణామం_ స్త్రీలు                 ___పిళ్లా కుమారస్వామి,9490122229  మానవ పరిణామం            భూమి ఏర్పడిన తర్వాత భూమిపై అనేక జీవరాసులు పరిణామక్రమంలో ఏర్పడ్డాయి .ఒక దశలో అత్యధిక హిమపాతం కలిగిన భూమిని అంతరిక్షం నుంచి వచ్చిన ఆస్టరాయిడ్ శకలాలు తగలడం వల్ల అనేక వృక్షాలు జంతువులు మరణించాయి. ఆ సందర్భంలో  భూమి పైన అనేక గడ్డి మైదానాలు ఏర్పడ్డాయి. ఉత్తరకెన్యా, ఈశాన్య ఇథియోపియాలో లేక్   రుడాల్ఫ్ గడ్డి మైదానాలలో మానవ పరిణామ క్రమం ప్రారంభమైందనిఅందరూ అంగీకరిస్తున్నారు. అప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా  నడిచే వానరాలు చెట్ల మీద నుంచి భూమి మీదికి ఆహార సేకరణ కోసం చాలా దూరం గడ్డి  మైదానాల పై నడుస్తూ  వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో లో వానరాలు నిలబడటం అలవాటు చేసుకున్నాయి. వెనుక కాళ్ళు మొత్తం శరీరాన్ని మోయగల శక్తిని సంపాదించు కున్నాయి. కాలి వేళ్ళు భూమిని పట్టుకు నేందుకు అనువుగా పాదం వెడల్పుగా తయారైంది. అప్పుడు ముందు కాళ్ళు స్వేచ్ఛను పొందాయి. కాలక్రమంలో అవి మనిషి చేతులు గా రూపాంతరం చెందాయి. చెట్లు ఎగబాకే...

భారతదేశంలోతొలి మహిళా సంఘం

Image
( బుద్దభూమి మాస పత్రిక నుండి)( buddhist analysis) భారతదేశంలోతొలి మహిళా సంఘం మహిళా సంఘం పెట్టాలంటే మొదట బుద్దుడు వెనకా ముందాడాడు. ఎందుకంటే, వాళ్ళకు గల భౌతిక ఇబ్బందులుఅవరోధాలవుతాయేమోనని! ఆనందుని వాక్బలంతో, వాదనతోమహా ప్రజాపతి గౌతమి సారధ్యంలో భిక్షుణీ సంఘం స్థాపించాడు. అంతకుముందు ఎవరూ చేయలేదా? ప్రయత్నం కూడా చేయలేదా, మహిళలైనా ముందుకు రాలేదా? వేద కాలంలో స్త్రీలు గార్గి పండిత సభలో స్త్రీల తరుపున వాదిస్తుంటే, మహర్షి (యాజ్ఞవల్కుడు) వారించి, అణచివేస్తాడు. మహర్షికి ఇద్దరు భార్యలు. ఒక భార్య స్వతంత్రించి, జ్ఞానార్జనవైపు మొగ్గి,సన్యాసధర్మంస్వీకరించటానికి అనుమతి కోరుతుంది. ఉపనిషత్కా లంలో కూడా స్త్రీ స్వేచ్ఛకు చెప్పుకోదగ్గ ఉదాహరణలు లేవు. పురాణకాలంలో స్త్రీలకు పాతివ్రత్యాలు అంటగట్టి, వాళ్ల ముఖాన ఆయాచితంగా వివిధ వ్రతాలు, కాలక్షేప విధులు రుద్దారు. బానిసలుగా మార్చారు. దేవుళ్లకు సైతం పెళ్లాలుగామార్చారు. కృష్ణుడు మాత్రం యాదవ స్త్రీలను మధురలోను, బృందావనంలోను, యమునా తీరాన ఆర్గనైజ్ చేశాడు. ఎందుకు? తను వినోదానికి, అల్లరిచిల్లరి చేష్టలకు. ఆరాధన పేరుతో ఆత్మసంతృప్తికి. వాళ్లకు హక్కులు, అర్హతలు పాడు ఏమీ లేవు. విలువ...

శ్రామికవర్గ ఐక్యపోరాటాలే మార్గం

*శ్రామికవర్గ ఐక్యపోరాటాలే మార్గం*  Tue 07 Mar : 2023 *మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని భారతీయ సంస్కృతిలో నానుడి.నాటి నుండి నేటి వరకు సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు ఉత్పత్తిలో,అభివృద్ధిలో అంతే స్థాయిలో భాగస్వామ్యం వహిస్తున్నారు.* చరిత్రలో ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు మహిళల సగభాగం భాగస్వామ్యంతోనే విజయం సాధించారు. సమాజ అభివృద్ధిలో ఎంతో ప్రాధాన్యత గల మహిళ నాటి నుండి నేటి వరకు వివక్ష,అణచివేత,హింస,వెనుకబాటు తనానికి గురవుతూనే ఉంది.1990 న్యూయార్క్‌ టైమ్స్‌లో ఆసియా మరియు ఆఫ్రికాలో లింగ నిష్పత్తి గురించి అమర్త్య సేన్‌ రాసిన వంద మిలియన్లకు పైగా మహిళలు తప్పిపోయారు అనే వ్యాసం మూడు దశాబ్దాల తర్వాత నేటికి కూడా భారత దేశానికి వర్తిస్తుంది.  భారత్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 940 మహిళలు మాత్రమే ఉన్నారు.మగ పిల్లాడు పుడితే పండగ,ఆడపిల్ల పుడితే దండగ అని పుత్రుడు పున్నామ నరకం నుండి కాపాడేవాడు అనే ధోరణి తల్లిదండ్రులలో బలంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆడపిల్ల అని తెలియగానే సెక్...