ప్రభుత్వరంగం -మహిళలు
ప్రభుత్వరంగం -మహిళలు
ప్రభుత్వరంగ సంస్థలు ఆధునిక దేవాలయాలు, అన్ని వేళలా ఆదుకునే అక్షయ పాత్రలు. దేశ సమాజక, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి పటిష్టం చేసే విద్య వైద్యం, ఆరోగ్యం, గనులు. బ్యాంకింగ్, బీమా, సహజ వనరులు, రక్షణ, ఉత్పాదక రంగాలు ప్రభుత్వ అజమాయిషీలో కొనసా గడమే శ్రేయస్కరమని దేశ ప్రజలకోసం. రాజ్యాంగబద్ధంగా ఆయా ప్రభుత్వరంగ సంస్థలు ఆవిర్భవించాయి.ప్రైవేటు సంస్థ లు జాతీయకరణ చేయబడ్డాయి. 1950, 60, 70. 80 దశకాలలో ఈ ప్రక్రియ అనేక కుటుంబా లలో వెలుగులు నింపి వారి విద్య, వైద్య ఉపాధి అవకాశాలను మెరుగుపరిచాయి. "అబ్బాయి చదువు. అమ్మాయి పెళ్ళి" అనే నినాదం అనేక పొదుపు సంక్షేమ పథకాలలో ప్రాచుర్యంలో వుండేది. అమ్మాయిల చదువులకు తక్కువ ప్రాధాన్యం వుండేది. ప్రభుత్వరంగ సంస్థల వలన ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. క్రమేపి ఉద్యో గులు తమ ఆడపిల్లలను చదివించి వారు ఉద్యోగాలకు సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించడం ప్రారంభించారు. నాడు ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ భరోసా, భద్రత, సదుపాయాలు ప్రయోజనకరమైన కార్మిక చట్టాలను అమలు చేయడం మహిళల విద్యను, ఉపాధిని ప్రోత్సహించాయి. కార్మిక చట్టాల పటిష్ట అమలు నంఘటితరంగంలోనే సాధ్యమవుతాయి. ప్రభుత్వరంగ సంస్థల లోనే సంఘటితరంగం కనబడుతుంది.
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలో మహిళా కార్మికులు 45.31 వుండగా అందులో 58 2% మంది ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్నారు. వీటిలో మహిళల భాగస్వామ్యం పారదర్శకత ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించాయి. ఎగ్జిక్యూటివ్ కమిటీ స్థాయిలో వున్న మహిళల ప్రాతినిధ్యం ప్రయివేటురంగంలో 15% వుండగా ప్రభుత్వరంగ సంస్థలలో 22%వుంది. సామాజికంగానూ, మానసికంగానూ, భారతీయ మహిళ ప్రాథమికంగా కుటుంబానికి ప్రాధాన్యతనిస్తుంది. తల్లి, భార్య కుమారై, కోడలు ఇలా తన జీవితంలో వివిధ స్థాయిలలో బాధ్యతలకు భంగం కలుగ కుండా ఉద్యోగం చేయాలని ఆశ పడు తుంది. మహిళలు స్వతంత్ర రంగాలలో సయితం వెనుకంజ వేసే పరిస్థితి నెల కొంటున్నది.
మహిళల ప్రత్యేక అవసరాలు తీర్చే అన్ని రకాలుగా అనుకూలమయిన ఉపాధి రంగాలు బ్యాంకింగ్, బీమా రంగాలు మహిళా కార్మిక, ఉద్యోగులలో అనేక మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగాల ద్వారా ఉపాధి పొందుతున్నారు. మహిళా సాధికారతలో చేయూతనిస్తున్న ఈ రెండు రంగాలలో ఇప్పటికే బ్యాంకింగ్ రంగాన్ని తన పెట్టుబడిదారీ ప్రయోజన పక్షపాతంలో ప్రయివేటీకరణ విలీనాలతో నిర్వీర్యం చేసింది. ఎకానమి కృంగిపోతున్న దశలో మహిళల ఉపాధి అవకాశాలు 16% దిగ జారగా ప్రభుత్వరంగ సంస్థల పతనం కార ణంగా 36% మంది మహిళలు ఉపాధిని, అవకాశాలను కోల్పోవడం జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునే అక్షయపాత్ర భారతీయ జీవితబీమా సంస్థ. ప్రభుత్వం తన మొండి వైఖరి, ఆశ్రిత పక్షపాతం కారణంగా దిగజారిన ఆర్ధిక వ్యవస్థను ఆదుకొంటున్నామనే మిషతో, తమ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, ప్రయివేటీకరణ లక్ష్యాలను అందుకోవడానికై బంగారు బాతులాంటి ఎల్ఐసిని గుడ్డు కోసంచంపిన మూర్ఖుని చందంగా అనిశ్చిత షేర్ మార్కెట్లో లిస్టింగ్ చేసి ప్రయివేటీకరించాలని ప్రయ త్తిస్తున్నది. 40 కోట్ల పాలసీదార్ల కష్టార్టి తాన్ని 130 కోట్ల ప్రజల సంక్షేమాన్ని ప్రయి వేటుపరం చేసే దిశగా పబ్లిక్ ఫ్రిఫెరెన్షియల్ ఆఫర్ (IPO) ప్రారంభించింది. గత 60 సంవత్సరాలుగా అనేక పోరాటాలతో వివిధ ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణలను తమ ఉద్యో గులు నిరసించారు. ప్రభుత్వ సంస్థలను కోల్పోవడమంటే మహిళా అభివృద్ధిని భద్రతను, సాధికారతను కోల్పోవడమే, జీవితానికి జీమా కల్పించే ఎల్ఐసి ప్రవేటీకరించబడితే కోట్లాది కుటుంబాలు వారిలో ముఖ్యంగా మహిళలు భద్రతను ఉపాధిని, ఆర్థిక సాధికారతను కోల్పోతారు. ప్రభుత్వరంగ సంస్థల మనుగడతో దేశ ఆర్థిక వ్యవస్థ, మహిళల ఉపాధి, భద్రత సాధికారత ముడిపడి వున్నాయి. ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాటాలలో ఇతర కార్మిక కర్షక, అసంఘటిత రంగాల ప్రజలను కలుపు కుని మహిళలు చైతన్యవంతంగా పోరాడి నపుడే ప్రభుత్వరంగం, మహిళలు తమ హక్కులను, సాధికారతను సాధించ గలరు.ఇవన్నీ
ప్రయివేటు, అసంఘటితరంగాలలో కనిపించవు. కేవలం ప్రభుత్వరంగ సంస్థ లలోనే 25, 30 సం||లు పూర్తి సర్వీసు చేసిన మహిళలను, సగర్వ పదవీ విరమణను చూడగలం. 'గులాబీ' చీటీలనిచ్చి తదుపరి ఉద్యోగం నుండి తన్ని తరిమేసే సంస్కృతి ప్రయివేటురంగానిది.
పురుషులతో సమానమైన నైపుణ్యం భౌతిక శ్రమను స్త్రీలనుండి రాబట్టలేమని, స్త్రీల ప్రత్యేక అవసరాలకు ఖర్చు, శెలవులు అనవసరమనే ధృక్పదంతో ప్రయివేటు సంస్థలు మహిళలకు కొన్ని స్థాయి ఉద్యోగాలను నిరాకరించడం లేదా పరిమితం చేయడం చేస్తాయి. రవాణారంగంలో ఇలాంటి భ్రమ లను పటాపంచలు చేస్తూ రాఫెల్ యుద్ధ విమానాన్ని సయితం మహిళలు నడిట చూపించారు. ఐ.ఏ.ఎస్., ఐ.ఏ.ఎస్. శాంతి భద్రతలు, అంతరిక్ష పరిశోధనా సంస్థలలో సయితం మహిళలు తమ సామర్యాన్ని నిరూపించుకున్నారు. రాజ్యాంగం ద్వారా, వివిధ చట్టాల ద్వారా మహిళలు పొందే భద్రత, ఉపాధి అవకాశాలు (ప్రభుత్వ రంగంలోనే సాధ్యమవుతాయి. వివిధ దేశా రిలో, మన దేశంలో సయితం ప్రయివేటు రంగంలో స్త్రీ పురుష వేతనాలలో సమానత్వం లేదు. ప్రభుత్వరంగ సంస్థలలో ఇలాంటి అన మానతలకు తావుండదు. ఆయా సంస్థలు ప్రయివేటీకరించబడినపుడు ఈ అసమానతలు, అభద్రత చొరబడతాయి.
నేడు ప్రభుత్వం స్వతంత్ర రంగాలను సైతం ప్రయివేటీకరించి అసంఘటిత కర్షక కార్మికులను పెట్టుబడిదార్ల విషపు కౌగిలిలోనికి నెట్టి వేస్తున్నది. ప్రజా సంక్షేమ బాధ్యత వహించాల్సిన దశలో నూతన పెన్షన్ పథకాలు, విధానాలు, వ్యవసాయ చట్టాలు. కార్మిక చట్టాల సవరణల ద్వారా ప్రభుత్వం తన బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకుంటూ కార్పొరేట్ కుబేరుల ఖజా నాలను నింపుతున్నది. ప్రజా ఉద్యమాలను నిరసన గళాలను దేశద్రోహులుగా. జాతి వ్యతిరేక చర్యలుగా, అర్బన్ నక్సలిజం అభివృద్ధి నిరోధకంగా ముద్రవేసి అరాచ కానికి పాల్పడుతున్నది. ఇటువంటి పరిస్థితు లలో మహిళలు ముందడుగు వేయాలంటే
ప్రభుత్వరంగ సంస్థలు చావడానికే పుట్టా యని, వాటిని ప్రయివేటీకరించడమే తమ లక్ష్యమని నిర్ణజ్ఞగా చెప్పుకున్న వ్యక్తులకు/ పార్టీలకు ఈ దేశ ప్రజలు కులమత ప్రాతి పదికన, మూఢభక్తి, గత ప్రభుత్వ అవినీతి, లక్షలకోట్ల నల్లధనం తిరిగివచ్చి దేశాన్ని ఆదుకుంటారనే ఆశ ఒక అవకాశమిచ్చి చూడాలనే ధృక్పధంతో, ప్రత్యామ్నాయ పార్టీల వైఫల్యాల కారణంగా అధికారాన్ని కట్ట బెట్టారు. మెజారిటీతో కూడాన అధికార మదం నేడు ఏకపక్షంగా కార్మిక చట్టాల సవరణ, ఉపసంహరణ ప్రభుత్వరంగ సంస్థల నిర్మూలన, ప్రయివేటీ కరణ చర్యలను ప్రభుత్వం నిర్భయంగా చేపట్టడానికి ఆయుధమయింది.
ప్రయివేటీకరణ విధానాల కార ణంగా ప్రయివేటు మేనేజ్ మెంట్ విధానాలు ప్రభుత్వరంగంలోకి కూడా చొచ్చుకు రావడం తిరోగమన చర్య, పని గంటల పెంపు, సౌలభ్యం లేని కెరీర్ అవకాశాలు, తిరోగమన వర్కింగ్ సంస్కృతి ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రవేశించడం సరళీకరణ విధానాల కారణంగా జరుగుతుంది. పని ప్రదేశం పని వేళలు, శిశు సంరక్షణ, పని సంస్కృతి భద్రత, కనీస సౌకర్యాలు విషయంలో ప్రభుత్వరంగ సంస్థలు మహిళల విషయంలో ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం వున్నది. ప్రయి వేటీకరణ చర్యలలో భాగంగా ప్రభుత్వం వివిధ సంస్థ లలో వి.ఆర్.ఎస్. పథకాలను ప్రకటిస్తున్నది. వీటి కారణంగా మొదటగా ఉపాధి కోల్పోయేది మహిళలే. ఆయా ఉ ద్యోగాలు మళ్ళీ భర్తీ కావు. భవిష్యత్తులో మహిళలకు ప్రభుత్వ సంస్థలలో ఉపాధి అవకాశాలు శూన్యమవుతాయి. షిప్టులు, పద్ధతిలేని పనిదినాలు, పనివేళలు మహిళలు ఉద్యోగాలలో చేరడానికి ఉన్నత అవకా శాలు పొందడానికి నేనుకంజ వేసేలా
చేస్తాయి నేడు చదువుకున్న మహిళలు ఎక్కు వగా సాఫ్ట్ వేర్ రంగంలోకి చేరుతున్నారు ఇది పూర్తిగా ప్రయివేటు, అసంఘటితరంగం ఉద్యోగాలలో తీవ్రమయిన పని ఒత్తిడి ఈ రాత్రిపూట పనివేళలు, తక్కువ ప్రసూతి శెలవు లేదా సెలవుల నిరాకరణ, వివాహా నంతర ఒత్తిడిల కారణంగా అనేకమంది సాఫ్ట్ వేర్ మహిళలు కేరీర్ మద్యలోనే ఉద్యోగాలు మానేస్తున్నారు
నియమిత పని వేళలు, ఉద్యోగ భద్రత, సక్రమ వేతనం, ప్రసూతి శెలవులు, వారంతపు శెలవులు వంటి సౌకర్యాలు ప్రయివేటు అసంఘటిత రంగాలలో బహుస్వల్పం. ప్రయివేటు రంగంలో కనీస సదుపాయాలను కూడా యాజమాన్యపు దయాదాక్షిణ్యాలుగా భావిస్తారు.
మహిళలు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, మరుగుదొడ్ల సదుపాయం, షిఫ్ట్ కు12 గంటల పనిచేయించుకోలేక పోవడం, ఇవన్నీ ఆర్ధికభారంగాను, అసౌకర్యంగాను భావించే ప్రయివేటు రంగం మహిళల ఉపాధిని పరిమితం చేస్తున్నాయి.
మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థయిన రైల్వే లో లక్షమంది మహిళా ఉద్యోగినులు వున్నారు. 1992 నుండి రవాణారంగం, ఆర్మీలో ఆఫీసర్ కేడర్లో మహిళలను అనుమతించారు. వివిధ ప్రభుత్వరంగ సంస్థలలో మహిళా ఉద్యో
గుల ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే
వైమానికదళం 13.09%
నేవీదళం 6%
ఆర్మీలో13.09%
బ్యాంకింగ్ రంగం - 23.1%
కమ్యూనికేషన్స్ 15%
విద్యారంగం 65.2%
మహిళలు ఉపాధి పొందుతుండగా
బీమారంగంలో 27.81%
మహిళా ప్రాతినిధ్యం వున్నది.
అంటే ప్రతి వంద మంది మహిళలలో 18 మంది మహిళలు భారతీయ జీవితబీమా సంస్థతో ముడిపడి ఉపాధి పొందుతున్నారు
1990 తర్వాత అధికారంలోకి వచ్చిన పి.వి.నరసింహారావు ప్రభుత్వం సోవియట్ యూనియన్ పతనానంతరం ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గాల్సిన పరిస్థితుల కారణంగా 3 ప్రభుత్వరంగ సంస్థలలో ప్రయివేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు. బిజెపి వాజ్పాయ్ ప్రభుత్వం 7 ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేయగా నేటి బిజెపి నరేంద్రమోడీ ప్రభుత్వం 23 ప్రభుత్వ సంస్థలను ప్రయి వేటీకరించింది. కొత్తగా ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు
Comments
Post a Comment