ఒంటరి మహిళల ఆత్మగౌరవమే ఆమెను ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ____విజయ భండారు, 88019 10908. కుటుంబ వ్యవస్థలో స్త్రీలను పిరికి వారిగా, బలహీనులుగా, సహనం, ఓర్పు, భావోద్వేగం కలవారుగా భావిస్తుంటారు. పురుషులు ధైర్యవంతులుగా, బలం, సామర్ధ్యం, దూకుడు కలవారుగా వుండడం వల్ల స్త్రీలపై ఆధిపత్యం చేయడాన్ని జెండర్ రూపంగా సమాజం ఆమోదిస్తోంది. అదేవిధంగా కుటుంబ వ్యవస్థలో ఇంటిపని, వంటపని, పిల్లల పెంపకం లాంటి పనులన్నీ స్త్రీలకు సంబంధించినవిగా, పురుషులు కేవలం కుటుంబం వెలుపల కష్టపడి పని చేయాలని భావిస్తుంటారు. పెళ్లి సమాజం కోసం, పిల్లలు వారసత్వం కోసం మాత్రమేనని పురుషులు భావించడం వలన స్త్రీలపై కుటుంబ హింస మరింత ఎక్కువ అవుతోంది. పిల్లల సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులిద్దరిది. చాలా కుటుంబాలలో పిల్లల్ని కానీ, పెంచే విషయంలో పురుషులు ఆ నిబద్ధతను చాలా కుటుంబాలలో పాటించడం లేదు. స్త్రీలు మాత్రం భర్తల, కుటుంబ పెద్దల అసహనాల నడుమ తన పిల్లల్ని ఎంత కష్టమైనా పెంచక తప్పడం లేదు. కుటుంబాలలో కీలకంగా ఉన్న స్త...
Comments
Post a Comment